వైఎస్ షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం
- March 11, 2022
హైదరాబాద్: నేటి నుంచి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభం కానుంది. నల్లగొండ జిల్లా కొండపాకగూడెం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు షర్మిల. పాదయాత్రలో 21వ రోజున ఆగిపోయిన గ్రామం నుంచే 22వ రోజు పాదయాత్ర తిరిగి మొదలు కానుంది. ఈ రోజు ఉదయం 11:30 గంటలకు లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయం నుంచి వైయస్ షర్మిల పాదయాత్రకు బయలు దేరుతారు.
మధ్యాహ్నం 3.30గంటలకు కొండపాకగూడెం గ్రామానికి చేరుకుని… స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం సాయంత్రం 4.15గంటలకు చిన్న నారాయణపురం, 5.00 గంటలకు నార్కెట్ పల్లి చేరుకుంటారు. నార్కెట్ పల్లిలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించి, ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 6.15 గంటలకు మడ ఎడవెల్లి గ్రామానికి చేరుకుంటారు. ఆ తర్వాత 6.45 గంటలకు పోతినేనిపల్లి క్రాస్ కు చేరుకుని అక్కడ ప్రజలతో మాట్లాడతారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







