చైనాలో మళ్లీ లాక్డౌన్..
- March 11, 2022
చైనా: కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈశాన్య నగరమైన చాంగ్‌చున్‌లో కొత్త వేరియంట్ బయటపడటంతో అధికారులు లాక్డౌన్ విధించారు. దీంతో కఠినంగా ఆంక్షలను అమలు చేస్తున్నారు. 90 లక్షలు ఉన్న చాంగ్‌చున్‌లో కొత్త వేరియంట్ కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోందని అధికారులు వెల్లడించారు. దీంతో స్థానికులు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని ఆంక్షలు పెట్టారు. మరోవైపు ఫ్యామిలీ సభ్యుల్లో ఒకరే నిత్యావసరాల కోసం బయటకు వెళ్లాలని సూచించారు. అది కూడా రెండు రోజులకు ఒకసారి మాత్రమే బయటకు రావాలన్నారు.
మరోవైపు చాంగ్‌చున్ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ మూడు సార్లు కరోనా పరీక్షలను చేయించుకోవాలని అధికారులు సూచించారు. అత్యవసరం కాని సేవలను రద్దు చేశారు. ట్రాన్స్పోర్ట్ లింకులను కూడా మూసివేశారు. కాగా 2020 మార్చి తర్వాత గత కొన్ని రోజులుగా చైనాలో రోజువారీ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. గ్వాంగ్ డాంగ్, జిలిన్, షాన్ డాంగ్ ప్రావిన్సులలో మెజారిటీ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. చైనా ప్రత్యేక పరిపాలన ప్రాంతం హాంకాంగ్‌లో కూడా భారీగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో అధికారులు తగు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







