మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

- March 11, 2022 , by Maagulf
మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం జగన్ క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ప్రస్తావన తీసుకువచ్చారు. మంత్రి పదవుల రేసులో చాలామంది ఉన్నారని వెల్లడించారు. అయితే, మంత్రివర్గంలో స్థానం లేనంత మాత్రాన పక్కనబెట్టినట్టు కాదని స్పష్టం చేశారు. మళ్లీ గెలిచి వస్తే మంత్రులుగా ఉండేది మీరేనంటూ వ్యాఖ్యానించారు. మంత్రివర్గంలో లేనివారు పార్టీ కోసం పనిచేయాలని అన్నారు. ఒకవేళ పదవిని కోల్పోయిన వారికి జిల్లా ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. కాగా, వైస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం అనంతరం క్యాబినెట్ విస్తరణపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com