దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో 2022లో పర్యటించిన షేక్ మహ్మద్

- March 12, 2022 , by Maagulf
దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో 2022లో పర్యటించిన షేక్ మహ్మద్

దుబాయ్: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శుక్రవారం నాడు ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన మూడు యాచ్ షోలలో ఒకటైన దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షోను సందర్శించారు. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ షేక్ మన్సూర్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌తో కలిసి దుబాయ్ హార్బర్‌లోని ఐదు రోజుల ఈవెంట్ యొక్క కొత్త వేదికను షేక్ మహ్మద్ సందర్శించారు. ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ మాట్లాడుతూ.. దేశం గొప్ప సముద్రయాన వారసత్వాన్ని కలిగియుందన్నారు. ప్రపంచ స్థాయి సముద్ర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది ప్రేరణగా నిలుస్తుందన్నారు. దుబాయ్ నేడు గ్లోబల్ యాచ్ క్యాపిటల్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాచ్ యజమానులు, చార్టర్లు, క్రూయిజ్ ట్రావెలర్‌లకు ఇష్టపడే గమ్యస్థానంగా ఉందన్నారు. ఈ పర్యటనలో షేక్ మహమ్మద్‌తో పాటు దుబాయ్ ఎకానమీ అండ్ టూరిజం డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ హెలాల్ సయీద్ అల్ మర్రి, దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అథారిటీ,దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ సయీద్ మహమ్మద్ హరేబ్ కూడా ఉన్నారు. ఈ షో మార్చి 13 వరకు నడుస్తుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షోలో 54 కంటే ఎక్కువ దేశాలు పాల్గొంటున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com