'వరల్డ్ ఆర్ట్ దుబాయ్' లో తెలుగమ్మాయి
- March 12, 2022
హైదరాబాద్ కు చెందిన లక్ష్మి వక్కలంక సైన్సు లో ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి డిగ్రీ కంప్యూటరు ప్రోగ్రామింగు అభిరుచితో నేర్చుకుని స్వయంకృషితో ఆ రంగములో విశేష ప్రతిభకు దుబాయ్ ను వేదికగా చేసుకున్నారు.స్లాడ్స్ అడ్వరుటైజింగు సంస్థ నెలకొల్పి దుబాయ్ కేంద్రముగా చేసుకుని, హైదరాబాద్ లో కూడా బ్రాంచి స్థాపించారు.
గత 25 సంవత్సరాలుగా యూఏఈ లో నివసిస్తూ గత ఏడాది యూఏఈ గోల్డెన్ జూబ్లీ ఇయర్ జరుపుకుంటున్న వేళ తనకి ఒక ఆలోచన వచ్చింది.గత 50 సంవత్సరాలలో, ఒక 50 ముఖ్యమైన దేశ విజయాలు గానీ ముఖ్యమైన అభివృద్ధి విషయాలు గానీ ఎంచుకుని, "UAE's Accomplishments & Ambitions" అనే పేరిట 50 యక్రిలిక్ మిక్స్‌డ్ మీడియా పెయింటింగ్‌లు (80x100 సెం.మీ.) ఫ్రేమ్డ్ కాన్వాస్‌లు మీద చిత్రీకరించారు.
ప్రతి ఏటా దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (DWTC) వారు నిర్వహించే "వరల్డ్ ఆర్ట్ దుబాయ్" అనే ఆర్ట్ ఎక్సిబిషన్ లో ఈ నెల మార్చ్ 16 నుండి 19 వరకు జరగనుంది.ఈ ఆర్ట్ ఎక్సిబిషన్ లో లక్ష్మి వక్కలంక తన ఆర్ట్ వర్క్ ను ప్రదర్శించనున్నారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







