ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లో 'బంపర్ సేల్'
- March 12, 2022
ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు మరో మెగా సేల్ తో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. మార్చి 31తో ఆర్ధిక సంవత్సరం ముగియనుండటంతో ఈలోగా స్టాక్ క్లియరెన్స్ కోసం సంస్థలు పోటీపడి మరీ డిస్కౌంట్ సేల్స్ ను ప్రారంభించాయి. అమెజాన్ సంస్థ శుక్రవారం నుంచి “ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్, ఫ్యాబ్ టీవీ ఫెస్ట్” సేల్ పేరుతో భారీ డిస్కౌంట్ సేల్ ను ప్రారంభించగా, ఫ్లిప్‌కార్ట్ సంస్థ “బిగ్ సేవింగ్ డేస్” పేరుతో శనివారం నుంచి డిస్కౌంట్ సేల్ ప్రారంభించింది.
అమెజాన్ లో మార్చి 11 నుంచి మార్చి 14 వరకు జరుగుతున్న “ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్, ఫ్యాబ్ టీవీ ఫెస్ట్” సేల్ లో స్మార్ట్ ఫోన్స్, టీవీలు, ఇతర గృహోపకరణాలు డిస్కౌంట్ సేల్ లో లభిస్తున్నాయి. రెడ్మి, శాంసంగ్, టెక్నో వంటి ఫోన్ లతోపాటుగా బ్రాండెడ్ టీవీలపైనా భారీ డిస్కౌంట్ లభిస్తుంది. సేల్ డిస్కౌంట్ తో పాటుగా..హెచ్.డీ.ఎఫ్.సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకుల కార్డులపై పది శాతం అదనంగా డిస్కౌంట్ అందిస్తుంది అమెజాన్. వీటితో పాటు అదనంగా ఫోన్ ఎక్స్చేంజ్, నో కాస్ట్ ఈఎంఐ వంటి సదుపాయాలు కూడా అమెజాన్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.
ఇక ఫ్లిప్‌కార్ట్ లోనూ భారీ డిస్కౌంట్ సేల్ శనివారం నుంచి ప్రారంభమైంది. “బిగ్ సేవింగ్ డేస్” సేల్ లో భాగంగా మొబైల్స్, టీవీలు సహా ఇతర ఉత్పత్తులు సైతం డిస్కౌంట్ లో లభిస్తున్నాయి. మార్చి 12 నుంచి మార్చి 16 వరకు ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. సేల్ లో భాగంగా సాధారణ డిస్కౌంట్ తో పాటు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా క్రెడిట్ కార్డు వినియోగదారులకు అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. అయితే ఈ సేల్ పరిమిత ఉత్పత్తులపైనా స్టాక్ ఉన్నంతవరకే చెల్లుతుందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







