యార్మౌక్ కల్చరల్ సెంటర్‌లో ఘనంగా ‘స్ప్లెండర్స్ ఆఫ్ ఇండియా’
- March 13, 2022
కువైట్: ఇండియా, కువైట్ మధ్య దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ రాయబార కార్యాలయం నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ (NCCAL) సహకారంతో కువైట్‌లో దార్ అల్-అథర్ అల్-ఇస్లామియా మ్యూజియం-యార్మౌక్ కల్చరల్‌లో స్ప్లెండర్స్ ఆఫ్ ఇండియా - ఫెస్టివల్‌ని నిర్వహించింది. దార్ అల్-అథర్ అల్-ఇస్లామియా మ్యూజియం సీనియర్ అధికారులు, ఇతరఅధికారులతో కలిసి భారత రాయబారి సిబి జార్జ్ ఈ ఫెస్టివల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం యొక్క సుసంపన్నమైన, విభిన్నమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని పురస్కరించుకుని కువైట్‌లో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను స్ప్లెండర్స్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఫెస్టివల్ లో భాగంగా ఇండియన్ కమ్యూనిటీ, ఇండియన్ వంటకాలు, ఇండియాలో తయారు చేసిన అనేక సాంస్కృతిక కళారూపాలు, వస్తువులకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. అలాగే భారతీయ సినిమాలను పగటిపూట ప్రదర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







