ఎక్స్ పో 2020 దుబాయ్‌: ఇండియా పెవిలియన్‌లో 'స్టీల్ వీక్' ప్రారంభం

- March 13, 2022 , by Maagulf
ఎక్స్ పో 2020 దుబాయ్‌: ఇండియా పెవిలియన్‌లో \'స్టీల్ వీక్\' ప్రారంభం

దుబాయ్: "స్టీల్ వీక్ ఇన్ ఎక్స్ పో 2020 దుబాయ్"లో భాగంగా, ఇండియన్ స్టీల్ కంపెనీల ప్రతినిధి బృందం యూఏఈలోని నిర్మాణ సంస్థలు, స్టీల్ వినియోగదారులు, దిగుమతిదారులతో ఏడు రోజుల ఇంటరాక్టివ్ సెషన్‌లను నిర్వహిస్తోంది.  రెండు దేశాల మధ్య స్టీల్ బిజినెస్ ను పెంచడానికి, ఇటీవల ముగిసిన యుఎఇ-ఇండియా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సిఇపిఎ) ద్వారా లభించే అవకాశాలు, ప్రయోజనాల నుండి పరస్పర ప్రయోజనాలను పొందడం కోసం సహకార అవకాశాలను అర్థం చేసుకోవడం ఈ ఇంటరాక్టివ్ సెషన్‌ల లక్ష్యం అని ఇండియన్ ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇండియా పెవిలియన్‌లోని స్టీల్ వీక్ లో భాగంగా ఉక్కు రంగంలో భారతదేశ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందని, జాయింట్ వెంచర్లు, వ్యాపార అభివృద్ధికి UAE నుండి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తుందని పేర్కొంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, JSW స్టీల్, టాటా స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, AM/NS ఇండియాతో సహా ప్రధాన భారతీయ ఉక్కు ఉత్పత్తి కంపెనీలకు చెందిన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎక్స్ పో 2020 దుబాయ్‌లోని ఇండియా పెవిలియన్‌లో భారత ఉక్కు మంత్రి రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ స్టీల్ వీక్‌ను ప్రారంభించారు. భారత ఉక్కు రంగం 2030 నాటికి సంవత్సరానికి 300 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా చేసుకుంటోందని, విలువ ఆధారిత ఉక్కుపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని సింగ్ చెప్పారు. భారతదేశం స్వతంత్ర దేశంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 2047లో స్టీల్ విజన్ దిశలో ఇది ఒక పెద్ద అడుగు కానుందని మంత్రి స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com