భారత జాలర్లు పాకిస్థాన్ అధికారులు అరెస్టు చేశారు
- April 01, 2016
భారత్కు చెందిన 59 మంది మత్స్యకారులను పాకిస్థాన్ అధికారులు అరెస్టు చేశారు. మత్స్యకారులకు చెందిన 10 పడవలను కూడా స్వాధీనం చేసుకున్నారు. భారత సరిహద్దు జలాలను దాటి తమ జలాల్లోకి వచ్చారంటూ పాకిస్థాన్ సముద్ర జలాల రక్షణ ఏజెన్సీ(ఎంఎస్ఏ) అధికారులు ఆరోపిస్తున్నారు. గుజరాత్, సింధ్ సరిహద్దుల్లో వివాదాస్పద సర్ క్రీక్ ప్రాంతంలో జాలర్లు వేటకు వెళ్లగా పాక్ అధికారులు జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. జాలర్లను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
వివాదాస్పద జలాల్లో చేపల వేట కారణంగా పాక్, భారత జాలర్లు తరచూ అరెస్టవుతుంటారు.
ఇటీవల పాకిస్థాన్ భారత్కు చెందిన 86 మంది జాలర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంకా చాలా మంది మత్స్యకారులు జైళ్లలో మగ్గుతున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







