100 శాతం సామర్థ్యంతో స్కూళ్ళకు విద్యార్థులు

- March 14, 2022 , by Maagulf
100 శాతం సామర్థ్యంతో స్కూళ్ళకు విద్యార్థులు

షార్జా: షార్జాలో అన్ని ప్రైవేటు స్కూళ్ళు పూర్తి సామర్థ్యంతో నడవనున్నాయి.వ్యక్తిగత హాజరుతో అన్ని క్లాసులు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పూర్తి సామర్థ్యం అమల్లోకి రానుంది.ఈ మేరకు షార్జా ప్రైవేటు ఎడ్యుకేషన్ అథారిటీ ఓ ప్రకటన చేసింది. స్థానిక నేషనల్ ఎమర్జన్సీ క్రైసిస్ మరియు డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ సహకారంతో ఈ ప్రకటన చేశారు.దేశంలో కోవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్ రేటు వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నాక పూర్తిస్థాయిలో స్కూళ్ళు తెరవడం వల్ల సమస్య ఏమీ వుండదని బావించి తదనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com