కువైట్ లో నిరసన చేపట్టిన స్కూల్ క్లీనర్లు
- March 17, 2022
కువైట్: జీతాలు చెల్లించకపోవడంతో విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వందలాది మంది క్లీనింగ్ కంపెనీలకు చెందిన క్లీనర్లు నిరసన బాట పట్టారు. ఫర్వానియా ప్రాంతం మినహా 5 ప్రాంతాలలో క్లీనర్లు నిరసన చేపట్టారు. నిరసనలో భాగంగా వారందరూ విధులను బహిష్కరించారు. ఈ కార్మికులు కార్మిక మంత్రిత్వ శాఖ కాంట్రాక్టులపై పనిచేస్తున్నారు. కాగా క్లీనింగ్ కంపెనీలకు కొత్త కాంట్రాక్టులు జారీ చేయనున్నట్లు దీంతో పారిశుద్ధ్య సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విద్యాశాఖకు త్వరలో ఊరట లభిస్తుందని మంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారులు తెలిపారు. సంక్షోభాన్ని నివారించేందుకు మంత్రిత్వ శాఖలోని ఆర్థిక విభాగం క్లీనింగ్ కంపెనీలతో సమావేశమైందని త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. క్లీనింగ్ కార్మికులకు చివరగా గతేడాది జూలైలో జీతాలు చెల్లించారు. లేబర్ కంపెనీలు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడటంతో వాటి అకౌంట్లను స్తంభింపజేశారు. దాంతో దాదాపు 1,000 నుండి 1,100 మంది కార్మికులకు జీతాలు నిలిచిపోయాయి.
తాజా వార్తలు
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి