రమదాన్ ఉపవాస సమయాల్లో ఫుడ్ సర్వీస్: పుకార్లను ఖండించిన సౌదీ అరేబియా

- March 17, 2022 , by Maagulf
రమదాన్ ఉపవాస సమయాల్లో ఫుడ్ సర్వీస్: పుకార్లను ఖండించిన సౌదీ అరేబియా

సౌదీ అరేబియా: రమదాన్ ఉపవాస సమయాల్లో రెస్టారెంట్లు ఫుడ్ సెర్వ్ చేసేందుకు అనుమతులు జారీ అయ్యాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని సౌదీ అరేబియా ఖండించింది. కౌన్సిల్ ఆఫ్ సౌదీ ఛాంబర్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఉపవాస సమయాల్లో రెస్టారెంట్లకు అనుమతిచ్చినట్లుగా పేర్కొనబడుతోన్న విషయం పూర్తిగా అర్థరహితమని తెలుస్తోంది. కౌన్సిల్ ఈ విషయమై ఎవరికీ ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదని పేర్కొన్నారు. కర్టెన్లు, కవర్లు అడ్డం పెట్టి వుంటే, రెస్టారెంట్లలో ఫుడ్ సర్వింగ్‌కి అనుమతులుంటాయన్నది సదరు ఫేక్ లెటర్ సారాంశం. సౌదీ అరేబియా, రమదాన్ మాసంలో, ఇప్తార్ సమయానికిముందు టేక్ అవే సర్వీస్‌కి అనుమతివ్వడం జరుగుతుంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ముస్లిం సోదరులు ఉపవాసం చేస్తారు రమదాన్ మాసంలో. కాగా, గత ఏడాది దుబాయ్ ప్రభుత్వం, పబ్లిక్ కనిపించకుండా షీల్డ్ కవర్లు అడ్డం పెట్టి నడిపే రెస్టారెంట్లలో ఫుడ్ సర్వింగ్‌కి ఉపవాస సమయంలో అనుమతిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com