అబుదాబిలో కొత్త కొవిడ్-19 గైడ్ లైన్స్

- March 18, 2022 , by Maagulf
అబుదాబిలో కొత్త కొవిడ్-19 గైడ్ లైన్స్

 

యూఏఈ: ఎమిరేట్‌లో కొత్త కొవిడ్-19 గైడ్ లైన్స్ మార్చి 17 నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం వ్యాక్సిన్ తీసుకోని టూరిస్టులు దేశంలోకి స్వేచ్ఛగా రావచ్చు. అయితే వచ్చిన 48 గంటల్లో వారు పీసీఆర్ పరీక్ష చేయించుకొని నెగిటివ్ ఫలితాన్ని అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(NCEMA) ప్రకటించింది. NCEMA అధికారిక ప్రతినిధి డాక్టర్ తాహెర్ అల్ అమిరి మాట్లాడుతూ.. దేశంలో కరోనా తీవ్రత తగ్గుతోందని, ఈ క్రమంలో కొన్ని సడలింపులు ఇచ్చామన్నారు. COVID-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో దేశంలోని అన్ని వర్గాలు వ్యూహాత్మక వ్యవహారించాయన్నారు. అబుదాబి అమలు చేసిన వైరస్ కట్టడి విధానం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com