ఖౌలా హాస్పిటల్‌లో కొత్త పార్కింగ్ ప్రాజెక్ట్
- March 18, 2022
మస్కట్: సిటిజన్-రెసిడెంట్స్ లకు సదుపాయాలను మెరుగుపరిచే ప్రయత్నాలలో భాగంగా ఖౌలా హాస్పిటల్‌లో మరో 281 కార్ల కోసం పార్కింగ్ ప్రాజెక్ట్ ను మస్కట్ మునిసిపాలిటీ నిర్మించింది. మస్కట్ మునిసిపాలిటీ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహకారంతో ఖౌలా హాస్పిటల్‌లో కొత్త పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఆసుపత్రిలో మొత్తం పార్కింగ్ స్పాట్‌ల సంఖ్య 899 కి చేరిందని మంత్రిత్వ శాఖ చెప్పింది. ఆసుపత్రికి వచ్చే వారి కార్లకు సరిపడా పార్కింగ్ సౌకర్యం లేక, అడ్డదిడ్డంగా కార్లను పార్కింగ్ చేయడంతో తరచుగా రద్దీ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో కొత్త పార్కింగ్ స్థలాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మస్కట్ మునిసిపాలిటీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







