దుబాయ్ నివాసితులందరి వేలిముద్రలు సేకరణ

- March 21, 2022 , by Maagulf
దుబాయ్ నివాసితులందరి వేలిముద్రలు సేకరణ

యూఏఈ: దుబాయ్ లో సిటిజన్స్ , రెసిడెంట్స్ అందరి వేలిముద్రలను త్వరలో సేకరిస్తామని ఫోరెన్సిక్స్, క్రిమినాలజీ జనరల్ విభాగంలో వేలిముద్రల విభాగం డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ జాసిమ్ ముహమ్మద్ అబ్దుల్లా వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశాలలో అమలు చేస్తున్న కొత్త నేర నిరూపణ వ్యవస్థను దుబాయ్‌లో త్వరలో అమలులోకి తీసుకురానున్నట్లు అబ్దుల్లా తెలిపారు. ఫింగర్‌ప్రింట్ డేటాబేస్ తో వేగంగా, కచ్చితంగా దర్యాప్తు చేయవచ్చన్నారు. బయోమెట్రిక్ రికార్డులతో అనేక నేరాలకు సంబంధించిన ఆధారాలను కనుగొనడంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉందన్నారు. నేరస్థుల గుర్తింపును వేగవంతం చేయడంతోపాటు క్రిమినల్ కేసులలో త్వరగా న్యాయం పొందడానికి న్యాయ అధికారులకు సాక్ష్యాలుగా ఉపయోగపడతాయన్నారు. ఇంక్, పేపర్‌ని ఉపయోగించి ఎలక్ట్రానిక్ లేదా మాన్యువల్ స్కానింగ్ పరికరం ద్వారా వేలిముద్రలను తీసుకుంటారని,  ఆపై ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో సేవ్ చేయడానికి స్కానర్ సాయంతో ఫింగర్‌ప్రింట్ డేటాబేస్ లో సేవ్ చేస్తారని అబ్దుల్లా వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com