ఢిల్లీ నుంచి దోహా వెళుతున్న విమానం కరాచీలో అత్యవసర ల్యాండింగ్
- March 21, 2022
న్యూ ఢిల్లీ: ఢిల్లీ నుంచి దోహా వెళ్ళాల్సిన విమానం కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.ఖతార్ ఎయిర్ వేస్ కు చెందిన QR579 విమానాన్ని కరాచీలో అత్యవసరంగా దింపినట్లు అధికారులు తెలిపారు.
విమానంలోని కార్గో ప్రాంతంలో పొగలు రావటం గమనించిన సిబ్బంది వెంటనే సమీపంలోని కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.విమానంలో సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతా సురక్షితంగా ఉన్నట్లు సంస్ధ తెలిసింది.
ప్రయాణికులను కిందకు దింపి సమస్యను పరిష్కరిస్తున్నారు.ఢిల్లీ నుంచి తెల్లవారుజామున 3.50 నిమిషాలకు విమానం బయలుదేరింది.ఆ తర్వాత అది కరాచీలో 5.30 నిమిషాలకు ల్యాండ్ అయ్యింది. దోహా నుంచి కనెక్టింగ్ ఫ్లయిట్ ఉన్న ప్రయాణికులు అందులో ఉన్నారు.
ప్రయాణికులు దోహా వెళ్లటానికి రిలీఫ్ ప్లైట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఖతార్ ఎయిర్ వేస్ తెలిపింది. ఘటనపై దర్యాప్తు జరుగుతుందని…. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఖతార్ ఎయిర్ వేస్ ప్రకటించింది.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







