అంతర్జాతీయ కొరియర్ మరియు ఎక్స్‌ప్రెస్ కార్గో కోసం నూతన ఫెసిలిటీ ప్రారంభం
- March 21, 2022
హైదరాబాద్: GMR ఎయిర్ కార్గో మరియు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లిమిటెడ్ యొక్క విభాగం GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో (GHAC), నేడు అంతర్జాతీయ కొరియర్ మరియు ఎక్స్‌ప్రెస్ కార్గో సరుకుల నిర్వహణ కోసం కొత్త ఫెసిలిటీని ప్రారంభించినట్లు ప్రకటించింది.
హైదరాబాద్ విమానాశ్రయం ప్రారంభం నుండి ఆధునిక, ప్రపంచ స్థాయి ఎయిర్ కార్గో టెర్మినల్‌ను కలిగి ఉంది, కార్గో, లాజిస్టిక్స్‌కు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించడంతో, అలాంటి సరుకులను నిర్వహణ కోసం కస్టమ్స్ అధికారులచే ఆమోదించబడిన, ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ కొరియర్ నిర్వహణ ఫెసిలిటీ ఆవశ్యకత ఏర్పడింది.
హైదరాబాద్ కస్టమ్స్ వారి క్రియాశీల మార్గదర్శకత్వం మరియు మద్దతుతో, GHAC ఈ కొత్త ఫెసిలిటీని అభివృద్ధి చేసి, కార్యరూపంలోకి తెచ్చింది. ఈ కొత్త ఫెసిలిటీని ఈరోజు కస్టమ్స్ చీఫ్ కమిషనర్ బివి శివ నాగ కుమారి,ఎస్‌జికె కిషోర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్-జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్; ప్రదీప్ పణికర్, సీఈఓ-జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్;సౌరభ్ కుమార్, సీఈఓ- జీఎంఆర్ కార్గో, సమక్షంలో ప్రారంభించారు.
GHAC టెర్మినల్ ప్రాంగణంలో ఉన్న ఈ ఫెసిలిటీ కొరియర్ కార్గో షిప్మెంట్ల ఎగుమతి, దిగుమతులకు కొత్త గేట్వేగా మారనుంది. ఈ కొత్త ఫెసిలిటీ ఇండియన్ కస్టమ్స్ యొక్క ఎక్స్‌ప్రెస్ కార్గో క్లియరెన్స్ సిస్టమ్ (ECCS)తో అనుసంధానించబడింది. దీని వల్ల టెర్మినల్ వద్ద కొరియర్ కన్సైన్మెంట్ ప్రాసెసింగ్, క్లియరెన్స్ ఎలాంటి ఆటంకాలూ లేకుండా, తొందరగా జరుగుతాయి. ఈ ఫెసిలిటీ అధునాతన భద్రతా స్క్రీనింగ్ మరియు కార్గో హ్యాండ్లింగ్ సిస్టమ్‌లతో సహా అన్ని సహాయ మౌలిక సదుపాయాలు, పరికరాలతో అనుసంధానమైంది.
అంతర్జాతీయ కొరియర్ షిప్మెంట్ల నిర్వహణ కోసం GHAC కొత్త సదుపాయాన్ని ప్రారంభించడంతో హైదరాబాద్ ఎయిర్ కార్గో వాణిజ్యంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. దీని వల్ల ఇకపై హైదరాబాద్ నుండి/హైదరాబాద్‌కు అంతర్జాతీయ కొరియర్ షిప్మెంట్లు ఇతర మెట్రో నగరాల నుంచి ప్రాసెస్ కాకుండా స్థానికంగానే నిర్వహిస్తారు.
భవిష్యత్తులో GHAC హైదరాబాద్ ఎయిర్ కార్గో టెర్మినల్ తన సౌకర్యాలను పెద్ద ఎత్తున విస్తరించాలని భావిస్తోంది. ఒక పెద్ద, పర్పస్-బిల్ట్ ఎక్స్‌ప్రెస్/కొరియర్ కార్గో హ్యాండ్లింగ్ సదుపాయం దీనిలో భాగంగా ఉంటుంది.
GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో (GHAC) భారతదేశంలో WHO-GSDP (ప్రపంచ ఆరోగ్య సంస్థ- మెరుగైన నిల్వ మరియు పంపిణీ పద్ధతులు) ద్వారా సర్టిఫై చేయబడిన విమానాశ్రయం. టెంపరేచర్ సెన్సిటివ్ కార్గో నిర్వహణకు, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆటంకాలూ లేకుండా వాటిని సరఫరా చేయడానికి ఇది సదుపాయాలను కలిగి ఉంది. పెరిషబుల్స్, వ్యవసాయోత్పత్తులు, టెంపరేచర్ కంట్రోల్డ్ ఔషధాల కోసం GHAC ల్యాండ్సైడ్ మరియు ఎయిర్‌సైడ్‌లో తన మౌలిక సదుపాయాలను విస్తరిస్తోంది. దీనిలో భాగంగా ఎయిర్ సైడ్ రవాణా కోసం మొబైల్ రిఫ్రిజిరేటెడ్ యూనిట్ కూల్ డాలీని ప్రారంభించింది. ఇక్కడి నుంచి ప్రధానంగా పెరిషబుల్స్, (వ్యవసాయ మరియు సముద్ర ఉత్పత్తులు), ఔషధాలు, ఇంజనీరింగ్ & ఏరోస్పేస్, వస్త్రాలు మరియు ఎలక్ట్రానిక్స్ ఎగుమతి అవుతాయి.

తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







