క్రిప్టో కరెన్సీ వినియోగిస్తే, 100 మిలియన్ గ్రాండ్ ప్రైజ్ గెలుచుకునే అవకాశం

- March 21, 2022 , by Maagulf
క్రిప్టో కరెన్సీ వినియోగిస్తే, 100 మిలియన్ గ్రాండ్ ప్రైజ్ గెలుచుకునే అవకాశం

యూఏఈ: ఎమిరేట్స్ డ్రా మరియు యొట్టా చైన్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ లిమిటెడ్ సంయుక్తంగా ఓ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయ్. ఈ ఒప్పందం ద్వారా క్రిప్టో వినియోగదారులు ఎమిరేట్స్ డ్రాలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న క్రిప్టో వినియోగదారులు ఈ డ్రాలో పాల్గొనవచ్చు. ఈ డ్రా ద్వారా 100 మిలియన్ దిర్హాముల వరకూ గెలుచుకునే అవకాశముంటుంది. ప్రతీ ఆదివారం డ్రా విశేషాల్ని టెలికాస్ట్ చేస్తారు. మార్చి 20న తీసిన డ్రాలో 410 మంది విజేతలుగా నిలిచారు. మొత్తంగా 1,710,870 దిర్హాములను గెలుచుకున్నారు. ఓ విజేత 7 డిజిట్స్‌ని మ్యాచ్ చేశాడు. ఆయన 777,777 దిర్హాములు గెలుచుకున్నాడు. ఇప్పటిదాకా 20 మిలియన్ దిర్హాములు గెలుచుకున్నారు విజేతలు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com