దివంగత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కి పద్మ విభూషణ్ పురస్కారం..
- March 21, 2022
న్యూ ఢిల్లీ: భారత దేశ తొలి సీడీఎస్, దివంగత ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ కు సోమవారం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించారు. హెలికాప్టర్ చాపర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ మరణించిన విషయం తెలిసిందే.
బిపిన్ రావత్ భారత దేశానికి దేశానికి 27 వ ఆర్మీ చీఫ్ గా పనిచేశారు.అదే విధంగా, తొలి సీడీఎస్ గా సేవలు అందించారు.గత ఏడాది డిసెంబరు 8న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించారు.ఈ రోజు జరిగిన రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన బిపిన్ కుమార్తెలు కృతిక, తారిణి ఈ గౌరవాన్ని అందుకున్నారు.
దాదాపు 63 మందికి పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. వీరిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు.. గులాంనబీ ఆజాద్ ప్రజా వ్యవహారాల విభాగంలో పద్మ భూషణ్ పురస్కారం రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. పారా ఒలంపిక్స్ సిల్వర్ మెడల్ విజేత దేవెంద్ర ఝాజారియా పద్మ భూషన్ పురస్కారం అందుకున్నారు. సైరస్ పూనవల్ల వాణిజ్యం, పరిశ్రమల రంగంలో పద్మ భూషణ్ పురస్కారం అందుకున్నారు. ప్రముఖ దర్శకుడు చంద్ర ప్రకాశ్ కు సినిమా రంగంలో చేసిన సేవకు గాను పద్మ శ్రీ అవార్డును అందజేశారు.
అదే విధంగా, సచ్చిదానంద స్వామీకి పద్మ భూషణ్ పురస్కారం అందజేశారు. ఆయన సాహిత్యం, విద్యా రంగానికి ఎనలేని సేవ చేశారు. హకీ ప్లేయర్ వందన కటారియాకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేశారు. పారాషూటర్ అవని లేఖర కు పద్మశ్రీ ని ప్రదానం చేశారు. యోగాలో రంగంలో విశేష సేవచేసిన స్వామి శివానందకు పద్మశ్రీ పురస్కారాన్ని రామ్ నాథ్ కోవింద్ ప్రదానం చేశారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







