అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాలకు భారత రత్న ఇవ్వాలి
- March 21, 2022
అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి సంవత్సర సందర్భముగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో అమెరికా నుండి శంకర నేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షులు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 30 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహుకులు తెలిపారు. అందులో బాగంగా రెడ్డి ఊరిమిండి నిర్వహణలో 20 మార్చి 2022 నాడు జరిగిన అంతర్జాల (zoom) కార్యక్రమములో బాల ఇందుర్తి మాట్లాడుతూ ఇప్పటివరకు 48 మంది భారతరత్న అవార్డు కి ఎంపిక అవ్వగా, అందులో ఒక్క తెలుగువారికి కూడా దక్కకపోవడం బాధాకరం విషయం అని అన్నారు. అన్నమాచార్య భువనవాహిని సంస్థ అధ్యక్షురాలు, పద్మశ్రీ శోభారాజు పాల్గొని ఘంటసాలకి భారతరత్న ఇవ్వడం ఆ అమరగాయుడికి ఘనమైన నివాళి అని తెలిపారు, ఘంటసాల పాటలలో కొన్ని ఆణిముత్యాలను పాడి ప్రేక్షకులను అలరించారు.
సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్, అట్లాంటా నుండి శంకర నేత్రాలయ యు.యెస్.ఏ. పాలక మండలి సభ్యులు శ్రీని రెడ్డి వంగిమళ్ళ, దక్షిణ ఆఫ్రికా నుండి దక్షిణాఫ్రికా తెలుగు కమ్యూనిటీ అధ్యక్షులు విక్రమ్ పెట్లూరు, ఒమాన్ నుంచి తెలుగు కళా సమితి కన్వీనర్ అనిల్ కుమార్ కడించెర్ల, ఖతార్ నుంచి తెలుగు కళా సమితి అధ్యక్షులు ఉసిరికల్ల తాతాజీ, నార్వే నుంచి వీధిఅరుగు అధ్యక్షులు వెంకట్ తరిగోపుల, యూఏఈ నుంచి తెలుగు తరంగిణి అధ్యక్షులు వెంకట సురేష్, లండన్ నుంచి తెలుగు అసోసియేషన్ అఫ్ లండన్ ఉపాధ్యక్షులు రాజేష్ తోలేటి తదితరులు పాల్గొని ఇది ఇది 15 కోట్ల తెలుగువారందరికి ఆత్మ గౌరవానికి సంభందంచిన విషయం అని, ఘంటసాల గారికి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డు తో సత్కరించాలి అని అభ్యర్ధించారు, అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలు ఏకతాటిపై వచ్చి భారతరత్న వచ్చేంతవరుకు అందరు సమిష్టిగా కృషి చేయాలనీ అని తెలిపారు.
ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులుతో పాటు, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 33 కి పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించామని, ఈ టీవీ చర్చా కార్యక్రమాలకు ప్రపంచ దేశాలలోని తెలుగు సంఘాలకి అనుసంధాన కర్తగా సింగపూర్ నుండి రత్న కుమార్ కవుటూరు, న్యూజీలాండ్ నుండి శ్రీలత మగతల వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉదృతం చేసి ప్రపంచ దేశాలలో నివసిస్తున్న తెలుగు వారందరిని సంఘటితం చేస్తున్నట్లు నిర్వాహుకులు తెలిపారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







