క్రౌడ్ ఫండింగ్‌కు ఆమోదం తెలిపిన షేక్ మహమ్మద్

- March 22, 2022 , by Maagulf
క్రౌడ్ ఫండింగ్‌కు ఆమోదం తెలిపిన షేక్ మహమ్మద్

UAE: వినూత్న వ్యాపార ఆలోచనలకు ఆర్థిక సహాయం చేయడానికి ప్లాట్‌ఫారమ్ ఆపరేటర్‌లకు క్రౌడ్ ఫండింగ్ కోసం UAE సమాఖ్య ఆమోదించింది. సెక్యురిటీస్ అండ్ కమోడిటీస్ అథారిటీ కార్యకలాపాలకు రెగ్యులేటరీ అథారిటీగా ఇది ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన ఆపరేటర్లు సంబంధిత అధికారుల నుండి అవసరమైన అనుమతులు పొందినట్లయితే, సదరు ప్రాజెక్ట్‌ కు క్రౌడ్ ఫండింగ్ కు పోవచ్చు. ఈ క్రౌడ్ ఫండింగ్ వ్యవస్థ వాణిజ్య ప్రాజెక్టులకు, ముఖ్యంగా చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఎక్స్ పో 2020 దుబాయ్‌లో జరిగిన చివరి కేబినెట్ సమావేశం UAE వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షతన నిర్వహించారు. ఇందులోనే క్రౌడ్ ఫండింగ్‌కు షేక్ మహమ్మద్ ఆమోదం తెలిపారు.  “క్రూడ్ ఫండింగ్ అనేది కొత్త, వినూత్న వ్యాపార ఆలోచనలకు ఆర్థిక సహాయం చేయడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి. యువత, వ్యవస్థాపకులు వారి ఆలోచనలకు ఆర్థిక సహాయం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.”అని యుఎఇ వైస్ ప్రెసిడెంట్ సోమవారం ట్వీట్ చేశారు. క్రౌడ్ ఫండింగ్ అనేది ప్రాజెక్ట్ లేదా వ్యాపారానికి పబ్లిక్ నుంచి నిధులు సమకూర్చుకోవడానికి అనుసరించే ఓ పద్ధతి. కోఆపరేటివ్ సొసైటీల కోసం కొత్త చట్టాన్ని కూడా యూఏఈ కేబినెట్ ఆమోదించిందని, వాటిని ఫైనాన్షియల్ మార్కెట్లలో లిస్ట్ చేసేందుకు వీలు కల్పిస్తున్నట్లు షేక్ మహమ్మద్ తెలిపారు. ఇది వ్యూహాత్మక భాగస్వాములను పొందడానికి వారికి సహాయపడుతుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com