‘క్రూడాయిల్ కొరతకు సౌదీ బాధ్యత వహించదు’
- March 22, 2022
సౌదీ: ప్రపంచ మార్కెట్లలో చమురు సరఫరాలో ఎటువంటి కొరత వచ్చినా దానికి బాధ్యత తమది కాదని సౌదీ అరేబియా ప్రకటించింది. ఇటీవల ఇరాన్ మద్దతుగల ఉగ్రవాది హౌతీ మిలీషియా సౌదీలోని చమురు కేంద్రాలపై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. బాలిస్టిక్ క్షిపణులతో టెర్రరిస్టులు విరుచుకుపడ్డారు. హౌతీ మిలీషియాలకు టెక్నాలజీని అందజేసి వారిని సన్నద్ధం చేయడంలో ఇరాన్ ప్రముఖ పాత్ర వహిస్తోందని సౌదీ ఆరోపిస్తుంది. అంతర్జాతీయ సమాజం ఈ విషయాన్ని తెలుసుకోవాలని స్పష్టం చేసింది. చమురు, గ్యాస్, శుద్ధి చేసిన ఉత్పత్తుల లక్ష్యంగా టెర్రరిస్టులు దాడులు చేయడం వెనుక ఇరాన్ కుట్ర దాగి ఉందని, ప్రపంచ దేశాలు గ్రహించాలని సౌదీ మరోసారి కోరింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







