జర్మనీ-ఖతార్ మధ్య ఇంధన ఒప్పందం
- March 22, 2022
ఖతార్: దీర్ఘకాలిక ఆర్థిక భాగస్వామ్యానికి జర్మనీ, ఖతార్ లు ముందుకొచ్చాయి. ఉక్రెయిన్ పై దాడికి దిగిన రష్యా నుంచి ఇంధన వనరుల దిగుమతిపై యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జర్మనీ తన ఇంధన అవసరాలను పూర్తి చేసుకునేందుకు ఇతర దేశాల వైపు చూస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఖతార్ తో ఇంధన ఒప్పందాన్ని కుదర్చుకుంది. ఇన్నాళ్లు జర్మనీకి రష్యా అతిపెద్ద గ్యాస్ సరఫరాదారుగా ఉంది. బెర్లిన్‌లోని జర్మన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఖతార్ తో ఇంధన ఒప్పందం కుదిరినట్లు ధృవీకరించారు. జర్మనీ ఆర్థిక మంత్రితో కలిసి ఖతార్‌కు వచ్చిన ఇంధన కంపెనీలు.. ఇంధన సరఫరా కోసం మరిన్ని ఒప్పందాల కోసం ఖతార్ తో చర్చలు జరుపుతున్నాయని చెప్పారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







