Midnight Run: ఆ యువకుడికి నేను సాయం చేస్తా.. - రిటైర్డ్ జనరల్
- March 22, 2022
            ఉత్తరాఖాండ్‌లోని నోయిడాలో ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలని పని తర్వాత కూడా అర్ధరాత్రి పరుగులు తీస్తున్న యువకుడి కమిట్మెంట్ అందరికీ తెలిసిపోయింది.
ఫిల్మ్ మేకర్ వినోద్ కాప్రీ చేసిన పోస్టు వైరల్ అయి లెఫ్టినెంట్ జనరల్ సతీశ్ దువా (రిటైర్డ్) లెఫ్టినెంట్ జనరల్ వరకూ చేరింది. తనకు తానుగా ఆ యువకుడికి సాయం చేస్తానంటూ ముందుకొచ్చారాయన.
‘అతని ఉత్సాహం వెలకట్టలేనిది. రిక్రూట్మెంట్ టెస్టుల్లో మెరిట్లో పాస్ అయ్యేందుకు సాయం చేయాలనుకుంటున్నా. కుమాఉన్ రెజిమెంట్ కల్నల్, లెఫ్టినెంట్ జనరల్ రానా కలితా, ఈస్టరన్ ఆర్మీ కమాండర్ తో మాట్లాడాను. రెజిమెంట్‌లోకి రిక్రూట్మెంట్ కోసం సరిపోయే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. జై హింద్’ అని రిటైర్డ్ జనరల్ ట్వీట్ లో పేర్కొన్నారు.
వినోద్ కాప్రీ పోస్టు చేసిన వీడియోలో ఏముందంటే..
19ఏళ్ల యువకుడు అర్ధరాత్రి రోడ్డుపై పరిగెడుతూ ఇంటికి వెళ్తున్నాడు. అది గమనించిన సినిమా డైరక్టర్.. అలా వెళ్లడానికి కారణం అడగ్గా.. యువకుడి మాటలు విని ఫిదా అయిపోయాడు. నోయిడా ఖాళీ వీధుల్లో కల నెరవేర్చుకునేందుకు కిలోమీటర్ల తరబడి పరుగు తీస్తూ ప్రయత్నిస్తున్నాడు.
ఫిల్మ్ మేకర్ వినోద్ కాప్రీ కంట పడ్డాడు 19ఏళ్ల యువకుడైన ప్రదీప్ . నోయిడా వీధుల్లో పరుగెత్తుతూ వెళ్తున్నాడు. కుతూహలంతో యువకుడిని ప్రశ్నించాడు ఫిల్మ్ మేకర్. అంతే ఆ ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉంది. యువకుడి పరుగు సాగుతూనే ఉంది. అలా తాను రోజూ పది కిలోమీటర్లు పరిగెత్తుతూనే ఇంటికి వెళ్తానని చెప్పాడు.
ప్రస్తుతం తాను మెక్ డొనాల్డ్ సెక్టార్ 16లో పనిచేస్తున్నానని చెప్తూనే.. వినోద్ కాప్రీ తన కారులో దించుతానని చెప్పినప్పటికీ నో చెప్పేశాడు. కారు ఎక్కితే తనకు ఈ రోజు పరిగెత్తే అవకాశం మిస్ అయిపోతానని, ఇలా పరుగు ప్రాక్టీస్ చేసి ఆర్మీలో జాయిన్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నాడట.
ఉదయం సమయంలో పరిగెత్తడం ప్రాక్టీస్ చేయొచ్చు కదా అని అడిగితే.. ఉదయం 8గంటలకు లేచి పనికి వెళ్లడాని కంటే ముందే వంట చేయాలని.. రాత్రి పూటనే పది కిలోమీటర్ల పరుగు సాధ్యపడుతుందని చెప్పాడు. అలా ఇంటికి చేరుకున్న తర్వాత వంట చేసుకుని తిని తన అన్నకు పెట్టాలట. మంచాన పడ్డ తల్లిని చూసుకుని తిరిగి తెల్లారే పనిలోకి రావాలని చెప్తున్నాడు ఆ టీనేజర్.
This is PURE GOLD❤️❤️
— Vinod Kapri (@vinodkapri) March 20, 2022
नोएडा की सड़क पर कल रात 12 बजे मुझे ये लड़का कंधे पर बैग टांगें बहुत तेज़ दौड़ता नज़र आया
मैंने सोचा
किसी परेशानी में होगा , लिफ़्ट देनी चाहिए
बार बार लिफ़्ट का ऑफ़र किया पर इसने मना कर दिया
वजह सुनेंगे तो आपको इस बच्चे से प्यार हो जाएगा ❤️😊 pic.twitter.com/kjBcLS5CQu
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
 - మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
 - విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
 - గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
 - సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 







