రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకున్నవారికి నగదు బహుమతి : సీఎం స్టాలిన్‌

- March 22, 2022 , by Maagulf
రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకున్నవారికి నగదు బహుమతి : సీఎం స్టాలిన్‌

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనదైన శైలిలో పాలన కొనసాగిస్తున్నారు. పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిననాటినుంచి కొత్త కొత్త పథకాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. దీంట్లో భాగంగా మరో కొత్త పథకాన్ని ప్రకటించారు సీఎం స్టాలిన్. అందరికి ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో ‘ఆరోగ్య హక్కు’ (‘Right to Health Bill’) కోసం యత్నిస్తున్నారు. ఈ క్రమంలో మరో కొత్త పథకాన్ని ప్రకటించారు. అదే ‘రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోండీ..నగదు రివార్డు పొందండి’అని ప్రకటించారు. అంటే రోడ్డు ప్రమాదంలో గాయపడినవారికి వైద్య సహాయం అందించినవారికి ప్రభుత్వం నగదు రివార్డు ఇస్తుంది.

సీఎం స్టాలిన్ సోమవారం (మార్చి 21,2022)తమిళనాడులో రోడ్డు ప్రమాద బాధితులకు వైద్య సదుపాయాలను అందించడంలో సహాయపడే వ్యక్తులకు నగదు రివార్డులు, ధృవపత్రాలు ఇస్తామని ప్రకటించారు. ‘రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న వారికి గోల్డెన్ అవర్ వ్యవధిలో వైద్య సాయం అందిలే ఆసుపత్రులకు తరలించి సహాయం చేసిన వ్యక్తులు ప్రశంసా పత్రం తోపాటు రూ.5,000 నగదు రివార్డుగా ఇస్తాం’ అని స్టాలిన్ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు.

గాయపడిన వారికి మొదటి 48 గంటల్లో ఉచిత వైద్యం అందించే ‘ఇన్నుయిర్ కాప్పోన్’ పథకాన్ని సీఎం గతంలోనే ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 609 ఆసుపత్రులు, 408 ప్రైవేట్ ఆసుపత్రులు, 201 ప్రభుత్వ ఆసుపత్రులు గోల్డెన్ అవర్‌లో వైద్యం అందించి ప్రాణాలను రక్షించడానికి నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఇన్నుయిర్ కాప్పోన్ పథకం బాధితునికి గరిష్టంగా సుమారు లక్ష రూపాయల వరకు దాదాపు 81 గుర్తింపు పొందిన ప్రభుత్వాసుపత్రులలో వైద్య భీమాను పొందగలుగుతారు.

అయితే మొదటి 48 గంటల్లో తమిళనాడు ప్రమాద బాధితులు లేదా తమిళనాడులో ప్రమాదం బారిన పడిని ఇతర రాష్ట్రాల వారికి ఉచిత వైద్యం అందించబడుతుంది. సీఎం సమగ్ర భీమా పథకం లబ్ధిదారులు అదే ఆసుపత్రిలో చికిత్స కొనసాగించడానికి అనుమతిస్తారు. ఈ పథకం లేదా ఏదైనా భీమా పథకం పరిధిలోనికి రానివారు (పురుషులు లేదా మహిళలు) ప్రమాదం నుంచి కోలుకునేంత వరకు మాత్రమే ఉచిత వైద్యం అందిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com