అరుదైన మైల్‌స్టోన్‌కు చేరుకున్న అక్కినేని హీరో

- March 22, 2022 , by Maagulf
అరుదైన మైల్‌స్టోన్‌కు చేరుకున్న అక్కినేని హీరో

హైదరాబాద్: అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నాగచైతన్య... ఫస్ట్ మూవీ కమర్షియల్‌‌గా హిట్ ఇవ్వలేకపోయిన చైతూకి నటుడిగా మంచి పేరును తీసుకొచ్చింది. ఆ త‌ర్వాత చేసిన ఏ మాయ చేశావే సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాతో హీరోయిన్‌‌గా ఇండస్ట్రీకి పరిచయమైన సమంతతో ఏడడుగులు వేశాడు. కాకపోతే ఈ జంట నాలుగేళ్ళ వివాహ బంధం తర్వాత విడిపోయింది. ఇదిలావుండగా ఈ అక్కినేని హీరో సోష‌ల్ మీడియాలో అరుదైన ఫీట్ అందుకున్నాడు..ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో నాగ‌చైత‌న్య ఫాలోవ‌ర్ల సంఖ్య 7 మిలియ‌న్లకు చేరుకుంది. టాలీవుడ్ హీరోలలో 7 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన అతి తక్కువమంది సెలెబ్రెటీస్‌‌లో ఒకడిగా నిలిచాడు చైతూ.. స్టార్ హీరోలకి కూడా ఈ రేంజ్ ఫాలోయింగ్ లేకపోవడం విశేషం.

ఎన్టీఆర్ (3.6M), రామ్ చరణ్ (5.3M) మాత్రమే ఫాలోయింగ్ ఉంది. చైతూ ఇప్పుడు హిందీలో లాల్ సింగ్ చద్దాతో పాటుగా తెలుగులో దిల్ రాజు ప్రొడక్షన్‌‌లో ఓ సినిమా చేస్తున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com