హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం, 11 మంది సజీవ దహనం
- March 23, 2022
హైదరాబాద్: హైదరాబాద్లోని బోయిగూడలో అగ్ని ప్రమాదం సంభవించింది. శాద్వన్ స్క్రాప్ గోడౌన్లో చెత్త కాగితాలు ప్లాస్టిక్ కాలి మందు బాటిళ్లు సామాన్లు ఉండడంతో మంటలు వ్యాపించాయి. తెల్లవారుజామున జరిగిన ఘటనలో 11 మంది సజీవ దహనమయ్యారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఘటన జరిగిన సమయంలో గోడౌన్లో 12 మంది ఉండగా ఒకరు తీవ్ర గాయాలతో బయటపడ్డట్లు అగ్నిమాపక శాఖ అధికారులు గుర్తించారు. అర్థరాత్రి 2 గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కాసేపటికే స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఫైర్ సేఫ్టీ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. 8 ఫైరింజన్లతో.. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఉదయం ఐదున్నర గంటలవరకు మంటలు అదుపు చేశారు.
కాగా.. చనిపోయిన వారి ఆచూకీ కోసం ఉదయం 8 గంటల వరకూ గాలించారు. 11 మంది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో టింబర్ డిపోలో ఉన్న పలువురికి గాయాలైనట్లు తెలుస్తుంది. సెంట్రల్ జోన్ పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. మృతులను బిహార్ కు చెందిన వారిగా గుర్తించారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,హైదరాబాద్)
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







