ఫేక్ ఆన్‌లైన్ ఖాతాలు సృష్టిస్తే భారీ జరిమానాలు

- March 23, 2022 , by Maagulf
ఫేక్ ఆన్‌లైన్ ఖాతాలు సృష్టిస్తే భారీ జరిమానాలు

యూఏఈ: నకిలీ ఇమెయిల్‌లు, వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ ఖాతాలను సృష్టించే వారికి విధించే జరిమానాలను వివరిస్తూ UAE పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక షార్ట్ ఫిల్మ్ ను విడుదల చేసింది. వీడియో ప్రకారం.. పుకార్లు, సైబర్‌క్రైమ్‌లను ఎదుర్కోవడంపై ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 34 2021లోని ఆర్టికల్ (11) ప్రకారం, ఎవరైనా నకిలీ వెబ్‌సైట్, ఆన్‌లైన్ ఖాతా లేదా ఇ-మెయిల్‌ను సృష్టించిన పక్షంలో  జైలుశిక్ష, జరిమానా (50,000 Dhs - 200,000 Dhs వరకు) లేదా రెండింటిలో ఏదైనా ఒకటి విధిస్తారు. ఫేక్ వెబ్‌సైట్, ఆన్‌లైన్ ఖాతా లేదా ఇ-మెయిల్‌ని ఉపయోగించి ఎవరైనా వ్యక్తికి హాని కలిగించేందుకు ఉపయోగించినట్లయితే లేదా అనుమతించినట్లయితే, అపరాధికి కనీసం రెండేళ్ల జైలు శిక్ష, ఫైన్ విధించబడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వివరించింది. నకిలీ వెబ్‌సైట్, ఆన్‌లైన్ ఖాతా లేదా ఇ-మెయిల్ లతో UAE సంస్థలా చెప్పుకుంటూ మోసానికి పాల్పడితే.. ఐదేళ్ల వరకు జైలు శిక్ష, Dhs200,000 వరకు జరిమానా విధించబడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com