టీఎస్ఆర్టీసీ: మరో కార్యక్రమానికి శ్రీకారం..
- March 24, 2022
హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు తీసుకున్ననాటి నుంచి ఆర్టీసీని తనదైన శైలిలో ముందుకు తీసుకువెళ్తున్నారు. కొత్తకొత్త ప్రయోగాలతో మునుపెన్నడూ లేని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రజలతో టీఎస్ఆర్టీసీ మమేకం చేసేందుకు అహర్నిషలు కష్టపడుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టీవ్‌గా ఉంటూ.. ఆర్టీసీకి సంబంధించిన ఎవైనా సమస్యలు, సలహాలు ఇచ్చినా వెంటనే స్పందిస్తున్నారు. మొన్నటికి మొన్న.. తెలంగాణాకే తలమానికమైన సమక్క-సారక్క జాతర సందర్భంగా అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటివరకు చేర్చే బాధ్యతను తీసుకున్న ఆర్టీసీ.. ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఏప్రిల్ 10 శ్రీరామనవమిని పురస్కరించుకొని భద్రాద్రి శ్రీసీతారాముల కల్యాణోత్సవం ఎంతో వైభవోపేతంగా జరుగనుంది. అయితే శ్రీసీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ముంగిటికి తీసుకువచ్చే భారాన్ని మరోసారి టీఎస్ ఆర్టీసీ ఎత్తుకుంది. దీనికోసం భక్తులు చేయాల్సిందల్లా.. టీఎస్ఆర్టీసీ పార్శిల్ కౌంటర్లో రూ.80లు చెల్లించి బుక్ చేసుకోవడమే. మరిన్ని వివరాలకు కాల్ సెంటర్ నెం. 040-30102829, 68153333తో పాటు https://www.tsrtc.telangana.gov.in
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







