ఏపీ సీఎం జగన్‌కు కోర్ట్ సమన్లు.. ఓ ముఖ్యమంత్రికి ఇలా జరగటం ఇదే మొదటిసారి!!
- March 24, 2022
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 28న సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 2014లో తెలంగాణలోని హుజూర్‌నగర్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నిలక నియమావళిని ఉల్లంఘించారనే అభియోగంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సీఎం జగన్‌కు సమన్లు జారీ చేసింది.
2014లో హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వైఎస్ జగన్, శ్రీకాంత్ రెడ్డి, నాగిరెడ్డిలపై ఈసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలోనే సోమవారం సీఎం జగన్ హాజరుకావాలని నాంపల్లి ఎంపీ , ఎమ్మెల్యే ప్రత్యేక కోర్ట్ సమన్లు జారీ చేసింది. కాగా, మొదటిసారి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేయడం విశేషం.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







