విద్యార్థిని టీచర్ వేధించలేదని నిర్ధారించిన సీసీటీవీ ఫుటేజ్

- March 24, 2022 , by Maagulf
విద్యార్థిని టీచర్ వేధించలేదని నిర్ధారించిన సీసీటీవీ ఫుటేజ్

దోహా: ఓ విద్యార్థిపై టీచర్ వేధింపులకు పాల్పడ్డారనీ, ఈ క్రమంలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయనీ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత అసలు టీచర్, విద్యార్ధిపై దాడి చేయలేదని తేలింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్పష్టతనిచ్చింది. విద్యార్థి కావాలనే ఇదంతా చేసినట్లు విచారణలో అధికారులు నిర్ధారించారు. ఆడుకుంటున్న సమయంలో బాల్ కారణంగా జరిగిన గొడవ వల్ల విద్యార్థుల మధ్య కొట్లాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే గాయలయ్యాయి. ఇందులో విద్యార్థి తప్పిదమే వున్నట్లు అధికారులు గుర్తించారు. గొడవను ఆపేందుకు టీచర్ ప్రయత్నించి, ఆ విద్యార్థిని గ్రౌండ్ నుంచి క్లాస్ రూమ్‌కి పంపించేశారు. దీన్ని విద్యార్థి వేరే కోణంలో చూపి, టీచర్ తనపై దాడి చేసినట్లుగా ఫిర్యాదు చేయడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com