ఎయిర్‌పోర్టులో వింగ్స్ ఇండియా – 2022
- March 24, 2022
హైదరాబాద్: ఆసియాలో ప్రతిష్ఠాత్మకంగా భావించే వింగ్స్ ఆఫ్ ఇండియా గురువారం నుంచి ఆరంభం కానుంది. బేగంపేట ఎయిర్ పోర్టు వేదికగా వింగ్స్ ఆఫ్ ఇండియా-2022ను మార్చి 27 వరకు నిర్వహించనున్నారు.4 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో 24, 25 తేదీల్లో వ్యాపార వర్గాలకు మాత్రమే అనుమతి ఉండగా, సాధారణ ప్రజలకు 26, 27 తేదీల్లో లోనికి అనుమతిస్తారు.
రెండేళ్లకోసారి జరిగే వింగ్స్ ఇండియా ప్రదర్శన ఆసియాలోనే అతిపెద్ద వాణిజ్య, సాధారణ, పౌర విమానయాన ప్రదర్శనగా చెప్పుకొంటారు. ఈ కార్యక్రమాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MOCA), ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తుంది.
ప్రదర్శనలో భాగంగా విమానయాన రంగంలో పెట్టుబడుల ప్రకటనలు, ఒప్పందాలు, ప్రాంతీయ కనెక్టివిటీ, విమానయాన, హెలికాప్టర్లు, డ్రోన్ల వినియోగం, విమానయాన పరిశ్రమ దశ, దిశ మొదలైన వాటిపై చర్చలు జరుగుతాయి.
25న వింగ్స్ ఇండియా – 2022 ను పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే రోజు పౌర విమానయాన రంగంలో ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి హోటల్ తాజ్ కృష్ణలో వింగ్స్ ఇండియా అవార్డుల ప్రదానం చేస్తారు. ఈవెంట్ లో భాగస్వాములు కానున్న విదేశీ ప్రముఖులు, రాయబారులు, ఎయిర్‌లైన్స్, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు, ఎయిర్‌పోర్ట్స్ ఏజెన్సీలు, సివిల్ ఏవియేషన్ అథారిటీలు, ఇంజినీరింగ్, కన్సల్టెంట్ వంటి ఏవియేషన్లోని వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొననున్నారు.
న్యూ హారిజోన్ ఫర్ ఏవియేషన్ ఇండస్ట్రీ థీమ్‌తో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహిస్తుంది. ప్రదర్శనలో 125 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. సారంగ్ బృందం ఎయిర్ షోలు ఆకట్టుకునేందుకు ముస్తాబయ్యాయి.
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
- DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
- సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!







