భర్త విజయాన్ని అభిమానులతో ఆస్వాదించిన ఉపాసన
- March 25, 2022
            టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు సినిమాను వీక్షించటం కోసం థియేటర్లకు వెళ్లారు. ఈ క్రమంలో రాంచరణ్ సతీమణి ఉపాసన కూడా హైదరాబాద్‌లోని భ్రమరాంభ థియేటర్లో సినిమాను చూసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా థియేటర్లో ప్రేక్షకులు ఉత్సాహంతో పెద్ద ఎత్తున కాగితాలు చించి ఉపాసనపై విసిరేశారు.
దీంతో ఉపాసన కూడా ప్రేక్షకులతో కలిసి ఎంజాయ్ చేసింది. కింద పడిన కాగితపు ముక్కులను తీసుకుని, ఆమె కూడా పైకి విసిరేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. కాగా, అంతకు ముందు భ్రమరాంభ థియేటర్లో రాంచరణ్ దంపతులు కాలు పెట్టిన సమయంలో వారిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.
మరోపక్క సినిమాను వీక్షించిన అభిమానులు.. ఇద్దరు హీరోలు చాలా చక్కగా చేశారంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో ప్రతి సన్నివేశం ఎంతో బాగుందని ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా సినిమాకు కిరవాణీ అందించిన సంగీతం ఎంతో బాగుందని అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అభిమానులు థియేటర్స్ ముందు డ్యాన్సులు వేస్తూ, నానా హంగామా చేస్తున్నారు.
. @upasanakonidela garu enjoying #RRRMovie at a MASS Theater!! 💥💥🤩🤩#RamCharan @RRRMovie#RRRMovie @AlwaysRamCharan #ManOfMassesRamCharan pic.twitter.com/YRfLXqnhYl
— Gopal Karneedi (@gopal_karneedi) March 25, 2022
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
 - మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
 - విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
 - గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
 - సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 







