ఎక్స్‌పో 2020 దుబాయ్ రష్: బస్సుల ట్రిప్పుల్ని పెంచిన ఆర్‌టీఏ
- March 26, 2022
యూఏఈ: మరో ఐదు రోజుల్లో ఎక్స్‌పో దుబాయ్ 2020 ముగియనున్న దరిమిలా, పెద్దయెత్తున, ఈ ఈవెంట్ సందర్శన కోసం వెళుతున్నారు. దాంతో, ఎక్స్‌పో 2020 దుబాయ్‌కి వెళ్ళే సందర్శకుల సౌకర్యార్థం బస్సుల ట్రిప్పుల్ని ఆర్‌టీఏ పెంచింది. అనూహ్యంగా పెరిగిన సందర్శకుల తాకిడి నేపథ్యంలో వారికి రవాణా సౌకర్యం పరంగా ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ - ఆర్టీయే డైరెక్టర్ ఆఫ్ బస్సెస్ మొహమ్మద్ అల్ అలి చెప్పారు. జుబైల్ బస్టాండ్ వద్ద ఎక్స్‌పో దుబాయ్‌కి వెళ్ళే డబుల్ డెక్కర్ బస్సుల్లో చోటు కోసం సందర్శకులు కిక్కిరిసిపోయినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్కంలో బస్సుల సంఖ్యను పెంచినట్లు తెలిపారు. ఒక్కో బస్సులో 74 మంది ప్రయాణించే వీలుంది. షార్జా నుంచి ఉచితంగా ప్రయాణించేందుకు ఎక్స్‌పో రైడర్స్ అందుబాటులో వుంటాయిగానీ, ఇవి పరిమితం. ఆర్టీయే బస్సులు అల్ బరాహా లేదా అల్ ఘుబైబా బస్ స్టేషన్లకు అందుబాటులో వుంటాయి. అక్కడి నుంచి దుబాయ్ మెట్రో ద్వారా ఎక్స్‌పోకి వెళ్ళొచ్చు. బస్టాండ్లన్నీ కిక్కిరిసి వుంటున్నాయనీ, ఇప్పటికే పలుమార్లు ఎక్స్‌పోకి వెళ్ళినా కొన్ని పెవిలియన్లను మిస్ అయిన దరిమిలా, మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నట్లు షార్జా వాసులు కొందరు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్‌లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్‌లో భారీ భూకంపం..







