చిత్తూరులో పెళ్లి బస్సు ప్రమాదం.. డ్రైవర్ సహా ఏడుగురు మృతి..
- March 27, 2022
            తిరుపతి: తిరుపతిలోని చంద్రగిరి మండలం బాకరాపేట ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మవరం నుంచి తిరుపతి వస్తున్న పెళ్లి బృందం బస్సు లోయలో పడింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉండగా, సుమారు 300 అడుగుల లోయలో పడ్డ బస్సు పడిపోయింది. దీంతో ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటినా పోలీసులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే రెడ్ శ్యాండిల్ టాస్క్‌ఫోర్స్, పోలీసులు, ఫైర్ సిబ్బంది, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొని బస్సులో ఉన్నవారిని బయటకు తీస్తున్నారు. సుమారు 10 అంబులెన్స్‌లు తిరుపతి, చంద్రగిరి, బాకరాపేట, పాకాల నుంచి వచ్చాయి.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు సంఘటనా స్థలంలో 6మంది, హాస్పిటల్ లో ఒకరు మృతి చెందారు. అయితే క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు రిస్క్యూ టీం లో పాల్గొన్నారు. ఈ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. క్షతగాత్రులను తరలించేంతవరకు జిల్లా కలెక్టర్ హరినారాయన్ పర్యవేక్షించారు. అయితే మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- లండన్‌లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్‌తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 







