ఇండియా పెవిలియన్ లో ఇండో గ్లోబల్ బ్లాక్‌చెయిన్ సమ్మిట్
- March 27, 2022
దుబాయ్: ఎక్స్ పో లోని ఇండియా పెవిలియన్ లో ఇండో గ్లోబల్ బ్లాక్‌చెయిన్ సమ్మిట్ లాంఛనంగా ప్రారంభమైంది. బిట్‌కాయిన్ ఇప్పుడు మిలియన్ రెట్లు వృద్ధి రేటుతో USD 69500/-కి చేరుకుంది. చాలా క్రిప్టో కరెన్సీలు చాలా తక్కువ వ్యవధిలో మిలియన్ల రెట్లు పెరిగాయి. EDUBUK, Erium Exchange, Big Bull, Bitengen Exchange ఇండియా, విదేశాల నుండి వందలాది ప్రముఖ సంస్థల సహకారంతో యూరోపియన్ డిజిటల్ యూనివర్సిటీ (USA), యూరోపియన్ బ్లాక్‌చెయిన్ సెంటర్ ద్వారా సమ్మిట్‌ను ప్రమోట్ చేయనున్నట్లు ప్రొఫెసర్ సిధిక్ ఎ ముహమ్మద్ ఛాన్సలర్ యూరోపియన్ డిజిటల్ యూనివర్సిటీ తెలిపారు. ఈ సందర్భంగా EDUBUK వ్యవస్థాపకులు అపూర్వ బజాజ్, శివానీ మల్హోత్రా మాట్లాడుతూ.. డిజిటల్ కరెన్సీ గురించిన సమాచారం ప్రపంచానికి తెలియజేసేందుకు UAE, ఇండియా, మిడిల్ ఈస్ట్ లోని మీడియా గ్రూపుల మద్దతును కోరారు. బ్లాక్‌చెయిన్ క్రిప్టో, ఎన్ఎఫ్టిలు 2025 నాటికి భారతీయ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ట్రిలియన్ డాలర్ల విలువైన అదనపు విలువను జోడిస్తాయని ఇడియు ఛైర్మన్ నీల్ సావంత్ తెలిపారు. డా.వినయ్ కుమార్ రెడ్డి సరికొండ(ఎస్వీఆర్) మాట్లాడుతూ.. లక్షలాది మంది పిల్లలకు విద్యను అందించాలని, ప్రపంచ వ్యాప్తంగా వర్చువల్ స్పేస్‌ని సృష్టించేందుకు విశ్వవిద్యాలయాలు ముందుకురావాలన్నారు. తమ కంపెనీ ద్వారా నిరుపేదలకు ఉపాధి కల్పించాలనుకుంటున్నామని చెప్పారు.



తాజా వార్తలు
- ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం..కిటకిటలాడుతున్న క్యూలైన్లు!
- రష్యాపై ఆంక్షల బిల్లు పై ట్రంప్ సంతకం
- దుబాయ్‌లో Dh190,000 చోరీ..నిమిషాల్లోనే ముగ్గురు అరెస్ట్..!!
- కువైట్‌లో ఫైర్ఫోర్స్కు 8,282 అత్యవసర కాల్స్..!!
- అబుదాబి నుంచి రాస్ అల్ ఖైమాకు ఫ్లయింగ్ కార్..!!
- అంగోలా అధ్యక్షుడితో ఒమన్ సుల్తాన్ విందు భేటీ..!!
- ఇజ్రాయెల్ మీడియాలో తప్పుడు కథనాలను ఖండించిన ఖతార్..!!
- 41 దేశాలతో మల్టీనేషనల్ సముద్ర రక్షణ కూటమి..!!
- రెండేళ్ల కష్టాలకు తెర.. ఇద్దరు పిల్లలతో స్వదేశానికి చేరుకున్న భారతీయ మహిళ..!!
- పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు..కొత్త రూల్స్ ఇవే







