తెలంగాణ: చరిత్రలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్
- March 28, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలాఖరుకే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం నుంచే మాడు పగిలేలా ఎండలు దంచుతున్నాయి. ఓ వైపు ఎండ, మరోవైపు ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. నివాసాలు, కార్యాలయాలు, ఇతరత్రా ప్రదేశాల్లో చల్లగా ఉండడం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు. ఫలితంగా విద్యుత్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. ఒక్కరోజులోనే గతంలో ఎప్పుడూ చూడని కరెంటు డిమాండ్ ఉంటోంది. ఇప్పుడే ఇంత డిమాండ్ ఉంటే.. రానున్న రోజుల్లో ఇది అధికం కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రంలో భారీగా విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోదని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. 2022, మార్చి 28వ తేదీ సోమవారం సాయంత్రం 3.54 నిమిషాల వరకు ఏకంగా 13 వేల 857 మెగా వాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యధిక విద్యుత్ డిమాండ్ అని అధికారులు వెల్లడిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇదే అత్యధిక విద్యుత్ వినియోగంగా నమోదైందన్నారు. మూడు రోజుల క్రితం 13 వేల 742 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ కాగా సోమవారం 13 వేల 857 మెగా వాట్లు నమోదైందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగం, పరిశ్రమల స్థాపన, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతోనే విద్యుత్ డిమాండ్ పెరిగిందంటున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే 14 వేల 000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ రావచ్చని అంచనా వేస్తున్నారు. 16 వేల 000 మెగా వాట్ల విద్యుత్ వినియోగం డిమాండ్ వచ్చినా సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని మరోసారి స్పష్టం చేస్తున్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు పని చేస్తాయని ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌కు కొత్త అద్దె సూచిక.. కొత్త చట్టంతో పారదర్శకతకు ప్రాధాన్యం
- కువైట్‌లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్‌లో అల్ అమెరికాత్ ఓవర్‌పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్‌లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!







