'బంతిపూల జానకి' చిత్రం పోస్టర్‌ను మెహన్‌లాల్ విడుదల చేశారు...
- April 02, 2016
ధన్‌రాజ్, దీక్షాపంత్ జంటగా నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై కళ్యాణి రామ్ నిర్మిస్తున్న చిత్రం 'బంతిపూల జానకి'. ఈ చిత్రం గురువారంతో షూటింగ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో గుమ్మడి కాయ ఫంక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ధన్‌రాజ్ మాట్లాడుతూ, 'ఇటీవల మాలయాళ సూపర్‌స్టార్ మెహన్‌లాల్ మా చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఆయన పోస్టర్ విడుదల చేసిన వేళా విశేషమేంటోగాని షూటింగ్ మొత్తం అనుకున్నది అనుకున్నట్లుగా అంతా బాగా జరిగింది. నిర్మాత కళ్యాణిరామ్ మాపై నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించారు.ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టు కునేలా ఈ చిత్రాన్ని చేశాం. మంచి కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రంలో జబర్దస్త్ బ్యాచ్ చేసే కామెడీ హైలెట్‌గా ఉంటుంది. ఈ చిత్ర కథకు హీరోగా సెట్ అవుతానని దర్శకుడు నన్ను సెలక్ట్ చేసుకున్నారు. డబ్బు కోసం కాకుండా వృత్తి సంతృప్తి కోసం ఈ చిత్రంలో నటించాను. అందరిని అలరిస్తుందని నమ్ముతున్నాను' అని అన్నారు. 'నాకిది రెండో చిత్రం. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేశాం. సినిమా కోసం ధన్‌రాజ్ అందించిన సహకారం మరువలేనిది. అవుట్ అండ్ అవుట్ థ్రిల్లింగ్ కామెడీతో సాగే చిత్రమిది' అని దర్శకుడు తెలిపారు. దీక్షాపంత్ మాట్లాడుతూ, 'ఇందులో జానకి పాత్రలో నటిస్తున్నాను. సినిమా విడుదలైన తర్వాత అందరూ నన్ను జానకి అనే పిలుస్తారు. అంతగా నా పాత్ర ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నాను' అని చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







