బహ్రెయిన్ లో ‘డిజిటల్‌’ రెసిడెన్సీ పర్మిట్ స్టిక్కర్లు

- March 29, 2022 , by Maagulf
బహ్రెయిన్ లో ‘డిజిటల్‌’ రెసిడెన్సీ పర్మిట్ స్టిక్కర్లు

బహ్రెయిన్: జాతీయ ఇ-గవర్నమెంట్ పోర్టల్http://bahrain.bh ద్వారా రెసిడెన్సీ స్టిక్కర్‌ల డిజిటలైజేషన్‌ను ప్రకటించింది. దీని ద్వారా సిటిజన్స్, వ్యాపార యజమానులు, రెసిడెంట్స్  ప్రయోజనం పొందవచ్చు. రెసిడెన్సీ పర్మిట్ స్టిక్కర్లు ఇకపై నివాసితులు, వారి కుటుంబాలు, కంపెనీలు, సంస్థల యజమానుల పాస్‌పోర్ట్ పై స్టాంప్ చేయవలసిన అవసరం లేదు. అనుమతులను QR కోడ్‌తో ఆన్‌లైన్‌లో రెన్యూవల్ చేయడంతోపాటు ముద్రించవచ్చు. వాటిని స్మార్ట్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ-మెయిల్ ద్వారా కూడా పంపవచ్చు. జాతీయ పోర్టల్ నుండి రూపొందించబడిన ఎలక్ట్రానిక్ కీ సేవ (eKey) ద్వారా వచ్చిన వారి కోసం అనుమతులు డిజిటల్‌గా మంజూరు చేస్తారు. ఈ సర్వీస్ 24 గంటలపాటు అందుబాటులో ఉంటుంది. ఎక్కడి నుండైనా యాక్సెస్ చేయవచ్చు. జాతీయత, పాస్‌పోర్ట్ లు, నివాస వ్యవహారాలను అత్యధిక నాణ్యతతో సర్వీసులను అందించేందుకు డిజిటలైజేషన్ లో భాగంగా ఈ సర్వీసును ప్రవేశపెట్టినట్టు సంబంధిత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com