ఎక్స్‌పో 2030 రియాద్ కోసం క్యాంపెయిన్ ప్రారంభించిన సౌదీ అరేబియా
- March 29, 2022
ఎక్స్‌పో 2020 దుబాయ్‌లో సౌదీ అరేబియా పెవిలియన్ పట్ల సందర్శకులు ప్రత్యేక ఆసక్తి చూపించారు. లక్షలాది మంది సౌద అరేబియా పెవిలియన్‌ని సందర్శించారు. ఇక, ఎక్స్‌పో 2030 రియాద్ కోసం ‘బిడ్’ క్యాంపెయిన్ అప్పుడే ప్రారంభించేసింది సౌదీ అరేబియా.పోటీలో సౌదీ అరేబియాతోపాటు సౌత్ కొరియా, ఇటలీ, ఉక్రెయిన్ మరియు రష్యా వున్నాయి. సౌదీ అరేబియా చరిత్ర, సంస్కృతి వంటి విషయాలపై సందర్శకులు ఈ ఎక్స్‌పోలో తెలుసుకోవడానికి ప్రత్యేక ఆసక్తి చూపారని నిర్వాహకులు తెలిపారు. కాగా, సౌదీ రాజధాని రియాద్ 2030 ఎక్స్‌పో కోసం అవసరమైన సౌకర్యాలు కల్పించగల సత్తా కలిగి వుందని ఈ మేరకు రాయల్ కమిషన్ ఫర్ రియాద్ సిటీ ప్రకటించింది. 2030 వరల్డ్ ఎక్స్‌పో కోసం పలు అత్యద్భుతమైన ప్రాజెక్టుల్ని ఇప్పటికే చేపట్టడం జరిగింది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..