ఇండియన్ ఎంబసీ ఎంప్లాయ్ అరెస్ట్
- March 30, 2022
సౌదీ: ఓ మహిళను ఫోన్‌లో వేధించినందుకు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయ ఉద్యోగి ప్రణవ్ కృష్ణని అరెస్టు చేశారు. సౌదీ అరేబియా నుంచి దక్షిణ భారత రాష్ట్రం కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో దిగుతుండగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతనిపై భారత పోలీసులు ఏడాది క్రితం లుక్అవుట్ నోటీసు జారీ చేశారు. సౌదీలోని ఇండియన్ ఎంబసీలో పనిచేస్తున్న ప్రణవ్ కృష్ణ సెలవుల కోసం కేరళకు వచ్చారు. లుకౌట్ నోటీసు ఆధారంగా ఎయిర్‌పోర్టు అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ప్రణవ్ అంతర్జాతీయ నంబర్లు, ఇంటర్నెట్ ద్వారా మహిళలను వేధించేవాడని సమాచారం. అతను దాదాపు ఏడాదిన్నర కాలంగా ఓ మహిళను ఇబ్బంది పెడుతున్నాడని, ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ పెట్టుబడుల భాగస్వామ్యంపై కీలక చర్చలు
- తెలంగాణా రాష్ట్రంలో తెలుగుభాషా దినోత్సవం
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!
- సౌదీలో వాహనాల నంబర్ ప్లేట్లపై కీలక హెచ్చరిక..!!
- యూఏఈ నేషనల్ డే.. విమాన టికెట్ల ధరలు రెట్టింపు..!!
- ఖతార్‌లో ప్రైవేట్ రంగంలో జాతీయీకరణకు ప్రణాళిక..!!
- ఒమన్‌లో 31 మంది ఆసియా జాతీయులు అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో విదేశీ కార్మిక నిబంధనలు మరింత సులభతరం..!!
- మన కళలు,సంస్కృతికి నిదర్శనం విజయవాడ ఉత్సవ్: మంత్రి కందుల దుర్గేష్
- అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు!







