ఇండియాకు ఫ్లైట్స్ షెడ్యూల్ ప్రకటించిన ఎమిరేట్స్
- March 30, 2022
యూఏఈ: దుబాయ్ ఆధారిత క్యారియర్ ఎమిరేట్స్ ఏప్రిల్ 1, 2022 నుండి ఇండియాలోని పలు నగరాలకు ప్రీ-పాండమిక్ ఫ్లైట్ ఫ్రీక్వెన్సీలను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇండియాలోని తొమ్మిది నగరాలకు వారానికి 170 విమానాలను నడుపనున్నట్లు వెల్లడించింది. ముంబై- 35 (వీక్లీ ఫ్లైట్స్), న్యూఢిల్లీ- 28, బెంగళూరు – 24, చెన్నై – 21, హైదరాబాద్ – 21, కొచ్చి – 14, కోల్‌కతా – 11, అహ్మదాబాద్ – 9, తిరువనంతపురం – 7 చొప్పున విమానాలను నడుపనున్నారు. అదే సమయంలో ఎమిరేట్స్ తన ఎయిర్‌బస్ A380, ఫ్లైట్ EK 500/501 డబుల్ డెక్కర్ లను ఈ నెల నుంచి దుబాయ్-ముంబై మధ్య తిరిగి ప్రారంభించనుంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ నుండి ఫస్ట్, బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించే కస్టమర్‌లు ఎయిర్‌లైన్స్ గ్లోబల్ నెట్‌వర్క్ లోని ఎంపిక చేసిన ప్రదేశాల నుంచి ఎయిర్ పోర్ట్ వరకు కాంప్లిమెంటరీ డ్రైవ్ సర్వీస్ ను పొందవచ్చని ఎయిర్‌లైన్ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్‌వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు