హైదరాబాద్ నుండి యాదాద్రికి ప్రత్యేక మినీ ఆర్టీసీ బస్సులు
- March 30, 2022
హైదరాబాద్: హైదరాబాద్ ఉప్పల్ నుండి యాదాద్రికి ప్రత్యేక మినీ ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. యాదాద్రి ఆలయం ప్రారంభమైన నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం యాదాద్రి కొండపైకి యాదాద్రి దర్శిని పేరుతో ప్రత్యేక మినీ బస్సులను ఏర్పాటు చేశారు. మినీ బస్సులను టీఎస్ఆర్టీసీ ఛైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ యాదగిరిగుట్టకు 100 మినీ బస్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రం, హైదరాబాద్ ఉప్పల్ సర్కిల్ నుండి మినీ బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. జెబిఎస్ నుండి 100 రూపాయలు, ఉప్పల్ నుండి 75 రూపాయలు ఛార్జీ ఉంటుందని వెల్లడించారు.
ప్రతి రోజు 104 సర్వీసులు అందుబాటులో ఉంటాయని, ఇవే కాకుండా ఇతర జిల్లాల నుండి ప్రత్యేక యాదాద్రి బస్సులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ వాహనాలకంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సుఖవంతంగా ఉంటుందని చెప్పారు. కొంత మంది ఉద్యోగులు వీఆర్ఎస్ కోరుకుంటున్నారని తెలిపారు.
బలవంతంగా తాము వీఆర్ఎస్ ఇవ్వటం లేదని స్పష్టం చేశారు. మొన్న ఫీల్డ్ విసిట్ చేసినప్పుడు 2000 మంది ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అన్నారని తెలిపారు. అందుకే వారు వాలంటరీ రిటైర్డ్ కావాలనుకుంటున్నారని పేర్కొన్నారు. ఇంకా ఎంత మంది వస్తారో చూసి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.
పెరిగిన సెస్ చార్జీలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆర్టీసీ చార్జీల పెంపు కాదు ఇవి సెస్ చార్జీలు మాత్రమేనని తెలిపారు. టోల్ ప్లాజా డబ్బులు టిఎస్ ఆర్టీసీ చెల్లిస్తుందన్నారు. ఏటా రూ.70 నుండి 100 కోట్ల వరకు ఆర్టీసీ నష్టపోతుందని తెలిపారు. ఆర్టీసీ లాభాల కోసమే చార్జీల పెంపు అని స్పష్టం చేశారు. ఇంత చేసినా రోజూ 6 కోట్ల రూపాయలు నష్టపోతున్నామని తెలిపారు. కొత్త బస్సులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!