డ్రైవర్లు లేని వాహనాల సేవలు 2023లో ప్రారంభం
- March 31, 2022
యూఏఈ: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఎక్స్‌పో 2020 దుబాయ్ వద్ద ప్రపంచ ప్రభుత్వ సమ్మిట్ 2022కి హాజరై, క్రూయిజ్ ఐఎన్‌సి, అమెరికా రూపొందించిన అటానమస్ (డ్రైవర్లు లేని వాహనాలు) వాహనాన్ని పరిశీలించారు. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ, క్రూయిజ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. డ్రైవర్ లేని వాహనాలు అలాగే ఇ- బుకింగ్ సర్వీసుల విషయమై ఈ ఒప్పందం కుదిరింది. RTA చీఫ్ మట్టర్ అల్ తాయెర్ మాట్లడుతూ, ఆర్టీయే తమ తొలి అటానమస్ వాహన సేవల్ని 2023లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. 2030 నాటికి ఈ వాహనాల సంఖ్య 4,000కి పెంచనున్నామని అన్నారు. ఈ డ్రైవర్ లెస్ వాహనాలకు అత్యాధునిక సాంకేతికతను జోడించారు. ప్రమాద రహితంగా వీటిని తీర్చిదిద్దారు. వాహనంలోకి ఎక్కాక, తాము దిగాల్సిన చోట దిగేందుకు వీలుగా అంతా ఆటోమేటిక్ సిస్టమ్ ఇందులో పొందుపరిచారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!