లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ యాజమాన్య హక్కులు కల్పించేందుకు అనుమతి

- March 31, 2022 , by Maagulf
లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ యాజమాన్య హక్కులు కల్పించేందుకు అనుమతి

ఒమన్: ఒమన్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్, పూర్తిస్థాయి విదేశీ యాజమాన్య హక్కుని లిస్టెడ్ కంపెనీల్లో కల్పించేందుకు అనుమతించనుంది. తద్వారా మార్కెట్లోకి ఇన్‌ఫ్లోస్ పెంచడమే ముఖ్య ఉద్దేశ్యమని, ఖతార్ కూడా ఈ దిశగా ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. మస్కట్ క్లియరింగ్ మరియు డిపాజిటరీ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. విదేశీ పెట్టుబడిదారులకు స్వర్గధామంలా ఒమన్‌ని మలచేందుకు చర్యలు తీసుకుంటున్నామని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 35 ప్రభుత్వ రంగ కంపెనీలను లిస్టింగ్ చేయాలని ఒమన్ భావిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com