ప్రముఖ దర్శకుడు శరత్ కన్నుమూత
- April 01, 2022
హైదరాబాద్: టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు శరత్ శుక్రవారం ఉదయం అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. తెలుగులో ఆయన దాదాపు 20 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘డియర్’ అనే నవల ఆధారంగా ‘చాదస్తపు మొగుడు’ అనే సినిమాతో ఇండస్ట్రీకి శరత్ పరిచయం అయ్యారు. బాలకృష్ణ, సుమన్ హీరోలుగా సినిమాలు తెరకెక్కించి భారీ విజయాలు సాధించారు. ఏఎన్నార్‌తో ‘కాలేజీ బుల్లోడు’, జగపతిబాబుతో ‘భలే బుల్లోడు’, బాలకృష్ణతో వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, సుమన్‌తో చాదస్తపు మొగుడు, పెద్దింటి అల్లుడు, బావ బావమరిది, చిన్నల్లుడు వంటి చిత్రాలకు శరత్ దర్శకత్వం వహించారు. కాగా దర్శకుడు శరత్ పెళ్లి చేసుకోలేదు.
తాజా వార్తలు
- కువైట్ లో ఉత్సాహంగా వికసిత్ భారత్ రన్ ..!!
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!