రేపే ఉగాది పురస్కారాలు ..
- April 01, 2022
హైదరాబాద్: చరిత్రలో మొట్టమొదటి సారిగా తెలుగు సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్ ల కళాకారులకు అవార్డులు ఇవ్వడం అనే ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడుతూ నేస్తం ఫౌండేషన్, తెలుగు సినిమా వేదిక, కూనిరెడ్డి ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో శుభకృతు నామ సంవత్సర ఉగాది నాడు సాయంత్రం 6 గంటలకు ప్రసాద్ ల్యాబ్స్ లో ఉగాది సినీ పురస్కారాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహక కమిటీ బాధ్యులు డైరెక్టర్ బాబ్జీ, కూనిరెడ్డి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రముఖ నిర్మాత , నటుడు, "మా" పూర్వాధ్యక్షులు మురళీమోహన్, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, ప్రముఖ నిర్మాత, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ , నిర్మాత , ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ , తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఇంకా అనేక మంది చిత్ర ప్రముఖులు హాజరు కానున్నారని వారు తెలిపారు.గతంలో సినిమా అవార్డులు అనగానే కేవలం నటీనటులు, దర్శకులు , నిర్మాతలు, ప్రధాన టెక్నీషియన్ లకు మాత్రమే పరిమితమయ్యేవనీ.. మిగిలిన విభాగాలను పరిగణన లోనికి తీసుకునే వారు కాదనీ .. ఆ సంప్రదాయానికి తెర దించుతూ సినిమా పరిశ్రమకు మూలాధారమైన అన్ని శాఖలను గౌరవించాలనే సదుద్దేశ్యంతో సినీ దిగ్గజాలు దాసరి, డి.రామానాయుడు, దొరస్వామిరాజు (డిడిడి) పేర్లతో "ఉగాది సినిమా పురస్కారాలు" అందివ్వడం జరుగుతుందని..ఈ సంప్రదాయాన్ని ప్రతి ఏటా ఇలాగే కొనసాగిస్తామని కమిటీ నిర్వాహకులు తెలియజేశారు.
తాజా వార్తలు
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!