కువైట్: లిఫ్ట్ కూలి భారత ప్రవాసుడు మృతి!
- April 03, 2022
కువైట్: కువైట్ లోని మంగాఫ్‌లో శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది.స్థానికంగా ఉండే ఓ అపార్ట్మెంట్లోని లిఫ్ట్ కూలిపోవడంతో ఓ భారత ప్రవాసుడు మృతి చెందాడు.శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.మృతుడిని కేరళకు చెందిన మహమ్మద్ షఫీగా గుర్తించారు.సమీపంలోని బక్కలా గ్రోసరీ స్టోర్‌లో పని చేస్తున్న అతడు డెలివరీ కోసం ఆ భవనానికి వెళ్లాడు.అదే సమయంలో ఈ ప్రమాదం జరిగింది.దీంతో లిఫ్ట్‌లో ఉన్న షఫీ అక్కడికక్కడే చనిపోయాడు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.పోలీసుల సమాచారంతో అక్కడికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది లిఫ్ట్‌ను తెరిచి షఫీ మృత దేహాన్ని బయటకు తీశారు.షఫీ మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
- DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
- సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!







