హైదరాబాద్‌లో రేవ్ పార్టీ భగ్నం.. 150 మంది అరెస్ట్..
- April 03, 2022
            హైదరాబాద్: హైదరాబాద్‌లో లేట్ నైట్ పార్టీ కల్చర్ రోజు రోజుకీ అధికమవుతుంది. తాజాగా సమయం దాటినా జరుగుతున్నా లేట్ నైట్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో లేట్ నైట్ పార్టీని నిర్వహిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఫుడింగ్ మింక్ పబ్‌పై మెరుపు దాడులు నిర్వహించారు. పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు దాడులు నిర్వహించారు. ఈ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ ఖమ్మం మాజీ ఎంపీ కూతురు గా గుర్తించారు. ఈ పబ్ లో ఆరు గ్రాముల కొకైన్ దొరికింది. ఫుడింగ్ అండ్ మింక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
అంతేకాదు లేట్ పార్టీలో 150 మంది యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.అదుపులోకి తీసుజున్న వారిలో పబ్ యజమానితో సహా సింగర్ రాహుల్ సిప్లిగంజ్, టాలీవుడ్ ప్రముఖ హీరో తనయ, సీనియర్ నటుడు కుమార్తె కూడా ఉన్నట్లు సమాచారం.39 మంది యువతులు ఉన్నారని పోలీసులు తెలిపారు.రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ వాడినట్లు తెలుస్తోంది. అయితే 150 మంది లో 145 మందిని పోలీసులు కండిషన్స్ తో వదిలి పెట్టారు. 5 గురిని మాత్రమే పోలీస్ స్టేషన్ లో ఉంచారు.ఇలా పోలీసు అదుపులో ఉన్న వారిలో ప్రముఖ హీరో కూతురు ఉన్నట్లు సమాచారం. ప్రముఖ హీరో, మేనల్లుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసులు దాడి చేయడంతో డ్రగ్స్ ను బాత్రూంలో, కిటికిలో నుంచి డ్రగ్స్ బయట పడేసినట్లు తెలుస్తోంది. ఫుడింగ్ మింక్ పబ్ బాత్రూంలో దొరికిన కొకైన్ ను టాస్క్ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. అంతేకాదు కిటిలోనుంచి బయటపడిన 12 ప్యాకెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే పబ్ బంజారాహిల్స్ పీఎస్ కి అతిసమీపంలో ఉంది. దీంతో పోలీసుల నిర్లక్ష్యం పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా రాడిసన్ పబ్ పై గతంలో కూడా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోలేదని తెలుస్తోంది. పబ్ మాజీ ఎంపీ కూతురుది కావడం తో చూసి చూడనట్లు బంజారాహిల్స్ పోలీసులు వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి మూడు గంటలు వరకు పబ్ నడిచినా పబ్ పై కన్నెత్తి చూడని బంజారాహిల్స్ పోలీసులు అంటూ ఆరోపణలు చేస్తున్నారు స్థానికులు.
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
 - మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
 - విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
 - గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
 - సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 







