హైదరాబాద్ పబ్ డ్రగ్స్ కేసులో పలు పేర్లు...ఆవేదనలో సెలెబ్రిటీలు

- April 03, 2022 , by Maagulf
హైదరాబాద్ పబ్ డ్రగ్స్ కేసులో పలు పేర్లు...ఆవేదనలో సెలెబ్రిటీలు

హైదరాబాద్: రాడిసన్ బ్లూ హోటల్ పబ్ డ్రగ్స్ కేసులో తన కుమార్తె నిహారికకు ఎలాంటి సంబంధం లేదని ప్రముఖ సినీ నటుుడు, మెగాబ్రదర్ నాగబాబు స్పష్టం చేశారు.

శనివారం రాత్రి తన కుమార్తె అక్కడ ఉన్న మాట వాస్తమేనని పేర్కొన్న నాగబాబు... పరిమిత సమయానికి మించి పబ్ కొనసాగడం వల్ల పోలీసులు చర్యలు తీసుకున్నారని తెలిపారు.

నిహారికపై తప్పుడు ప్రచారం వద్దంటూ నాగబాబు
అయితే ఈ విషయంలో నిహారికది ఎలాంటి తప్పు లేదని పోలీసులు తెలిపారని వెల్లడించారు నాగబాబు. ఈ కేసుపై సామాజిక మాద్యమాలు, మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసత్య ప్రచారం వద్దని విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు నాగబాబు. గత రాత్రి రాడిసన్ బ్లూ పబ్​ ఘటనపై నేను స్పందించడానికి కారణం నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటం. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పోలీసులు పబ్​పై యాక్షన్ తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు షీ ఈజ్ క్లియర్. ఇక్కడ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలాంటి అసత్యప్రచారం చేయకూడదనే నేను ఈ వీడియో రిలీజ్ చేస్తున్నా అని నాగబాబు పేర్కొన్నారు.

పబ్ వ్యవహారంతో గల్లా అశోక్‌కి సంబంధం లేదు: గల్లా ఫ్యామిలీ
మరోవైపు, పుడింగ్ మింక్ పబ్‌ రైడ్‌.. పార్టీకి సంబంధించి గల్లా కుటుంబం వివరణ ఇచ్చింది. రాత్రి హైదరాబాద్‌లోని ఓ పబ్‌పై పోలీసులు జరిపిన రైడ్‌లో గల్లా అశోక్ కూడా దొరికినట్టు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో గల్లా అశోక్‌కి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలని మీడియాలో ప్రసారం చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ గల్లా కుటుంబం విజ్ఞప్తి చేసింది.

తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలపై అంజన్ కుమార్ యాదవ్ స్పందన..
పుడింగ్ మింక్ పబ్‌లో తన కుమారుడు ఉన్నట్లు వచ్చిన స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్. పబ్‌లోఫ్రెండ్ బర్త్ డే పార్టీకే తన కుమారుడు వెళ్లాడని చెప్పారు. హైదరాబాద్ నగరంలో పబ్ కల్చర్‌ను బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో పబ్ కల్చర్ పై కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటాలు చేస్తామన్నారు అంజన్ కుమార్ యాదవ్. కాగా, పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఇంత జరుగుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించిన బంజారాహిల్స్ SHO శివచంద్రను సీపీ ఆనంద్ సస్పెండ్ చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్‌కు ఛార్జ్ మెమో ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com